Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోలుకున్న ఎల్‌కే అద్వానీ.. ఆసుపత్రి నుంచి ఇంటికి

LK Advani recovers and returns home from hospital
Advertisement
  • ఛాతీ ఇన్ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరిన బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ
  • ఆరోగ్యం మెరుగుపడటంతో ఇవాళ‌ డిశ్చార్జ్ చేసిన వైద్యులు
  • న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో చికిత్స
  • ఇటీవల వయోభారంతో పలుమార్లు ఆసుపత్రిలో చేరిన అద్వానీ
Advertisement
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఛాతీ ఇన్ఫెక్షన్‌తో ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేరిన 98 ఏళ్ల అద్వానీ, ఆరోగ్యం మెరుగుపడటంతో ఇవాళ‌ ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి.

ఈ నెల‌ 16వ తేదీ సాయంత్రం అస్వస్థతకు గురవడంతో ఆయనను కుటుంబసభ్యులు ఆసుపత్రిలోని పల్మనరీ విభాగంలో చేర్పించారు. సీనియర్ న్యూరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందించారు. చికిత్సకు ఆయన శరీరం స్పందించిందని, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినందున డిశ్చార్జ్ చేస్తున్నట్లు అపోలో ఆసుపత్రి పేర్కొంది. 

అద్వానీ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శనివారం ఆయనను పరామర్శించి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. వయోభారం కారణంగా ఇటీవలి కాలంలో అద్వానీ పలుమార్లు ఆసుపత్రిలో చేరారు. 

ఈ ఏడాది మే నెలలో కూడా వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో కొన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అంతకుముందు 2024 డిసెంబర్‌లో కూడా ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేర్చి వైద్య పరీక్షలు నిర్వహించారు.
Advertisement
Advertisement
LK Advani
BJP Leader
Apollo Hospital Delhi
Chest Infection Recovery
JP Nadda
Former Deputy Prime Minister

More Telugu News